Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు హ్యాట్రిక్ ఓటమి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 57 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చూసిన రాజస్థాన్ నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (65) లలిత్ యాదవ్ (38) మాత్రమే రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, చాహల్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టారు. యశస్వి జైస్వాల్ (60), జోస్ బట్లర్ (79) అర్ధ శతకాలతో విరుచుకుపడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ సంజూ శాంసన్ (0) విఫలమవ్వగా.. చివర్లో హెట్మయర్ (39) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ రెండు, కుల్దీప్ యాదవ్, రోవ్‌మన్ పొవెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.