Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవు దినాల కారణంగా కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోవడంతో పాటు భక్తులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా టైమ్‌స్లాట్ టోకెన్లు లేనివారు కొండపైకి రావొద్దని కోరారు. భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆహారం పాలు తాగునీరు. అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిందని అధికారులు వెల్లడించారు. శనివారం సాయంత్రం వరకు 50వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.