Authorization
Wed April 30, 2025 06:49:56 am
నవతెలంగాణ - అన్నవరం
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకునే వారికి వివాహ రిజిస్ట్రేషన్ల జారీని నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సత్యదేవుడి సన్నిధిలో వివాహాలు చేసుకునేవారు దేవస్థానం నిబంధనలకు అనుగుణంగా ధ్రువపత్రాలు ఇచ్చి రుసుము చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేసి ధ్రువపత్రం అందిస్తుంటారు. న్యాయపరమైన ఇబ్బందులు, దేవస్థానం ఇచ్చే ధ్రువపత్రాలకు చట్టబద్ధత లేకపోవడంతోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్లకు కొండపై ఏర్పాట్లు చేయాలని, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.