Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఐపీఎల్-16వ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన రైజర్స్.. ఆదివారం పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌ను డీకొననుంది. గత రెండు సీజన్లలో 8వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఈ సీజన్లోనైనా స్థానాన్ని మెరుగుపరచుకోవాలని ఆశిస్తున్నది.
తొలి రెండు మ్యాచ్‌లలో బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్‌కు పరాజయాలు తప్పలేదు. మెరుగైన బౌలింగ్ దళమున్నా స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడం వారి సామర్ధ్యానికి మించిన పనైంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం తమ పరాజయాలకు ముఖ్య కారణమని హెడ్ కోచ్ లారా అంగీకరించాడు. కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్క్రూడా వారి తలరాతను మార్చలేకపోతున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న హ్యారీ బ్రూక్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతున్నాడు.