Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇండియన్ ప్రీమియర లీగ్‌లో అరుదైన ఘనత సాధించాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన వార్నర్ మొత్తం ఐపీఎల్లో 6000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 6 వేల పరుగులు పూర్తి చేసిన తొలి విదేశీ ఆటగాడిగా వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. ఇక, ఐపీఎల్ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (225 మ్యాచ్‌ల్లో 6727 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత శిఖర్ ధవన్ (208 మ్యాచ్‌ల్లో 6370 పరుగులు), వార్నర్ (165 మ్యాచ్‌ల్లో 6004 పరుగులు), రోహిత్ శర్మ (228 మ్యాచ్‌ల్లో 5880 పరుగులు), రైనా (205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు) వరుసగా టాప్ ఫైవ్‌లో ఉన్నారు. వార్నర్ 2009లో తొలిసారి ఐపీఎల్ టోర్నీ ఆడాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు వరుసగా అన్ని సీజన్లలోనూ ఆడుతున్నాడు.