Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కుత్బుల్లాపూర్, పెట్ బషీరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. కొంపల్లి నుండి మేడ్చల్ వైపు వెళ్తున్న కారు అర్థరాత్రి 3గంటల ప్రాంతంలో అతి వేగంతో దూసుకువెళ్లి ఆగివున్న లారీని వెనక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులుః ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమే అని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, మరో ప్రమాదంలో.. దూలపల్లి నుండి బహదూర్‌పల్లికి బైక్‌పై వెళ్తున్న సుశ్వంత్ నాయక్ (23)ని ఎదురుగా వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాయక్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంఆర్సీఈటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగవ సంవత్సరం చదువతున్న సుశ్వంత్ నాయక్‌గా పోలీసులు గుర్తించారు.