Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం మళ్ళీ ఎర్ర జెండా వైపు చూస్తున్న క్రమంలో మనం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కమ్యూనిస్టుల ఓట్లు సీట్లు లేకుండా పోతున్నాయి భవిష్యత్ ఉందా అని ఆలోచిస్తున్నారని అన్నారు. కమ్యూనిస్టుల భవిష్యత్ ఉందా అనేది కాదు, కమ్యూనిస్టులు లేకపోతే మీకు భవిష్యత్ ఉందా అనేది ఆలోచించండి? అని ప్రశ్నించారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రతిపాదించిన చరిత్ర కాంగ్రెస్ ది కాదు, కమ్యూనిస్టులదే అన్నారు. ఒకే దేశం ఒకే టాక్స్ అని చెప్పే మోడీ ఎందుకు ఒకే కులం అని చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాతుర్వర్ణ వ్యవస్థ మళ్ళీ రావాలని కోరుకునే వారు బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు అని మండిపడ్డారు. బీసీ ప్రధాని అంటున్నారు కానీ బీసీ లకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో అన్ని పార్టీలు కుల, గణన జరగాలి అని చెబుతున్న బీజేపీ ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర కరణ కాదు, వికేంద్రీకరణ జరగాలి అని ప్రతిపాదించింది కమ్యునిస్టు పార్టీలని అన్నారు. బీజేపీ తెలంగాణ లో 50 సీట్లు ఇస్తాం అంటే వెళ్తమా? కాలి గోటితో సమానం మీ సీట్లన్నారు. అంతే కాకుండా గడ్డ మీద కాషాయ జెండాను ఎరుగానివ్వడం కాదు, తరిమి తరిమి కొడతాం, గోల్కొండ కోట కింద బొంద పెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.