Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాంగో
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఉగ్రవాదులు మరోసారి నరమేథానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందికి పైగా సాధారణ ప్రజలు చనిపోయారని సమాచారం. ఇది ఇలా ఉంటే, దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రసంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. బెనీ టెర్రిటరీలోని ముసందబాలో 20 మృతదేహాలను గుర్తించామని అక్కడి అధికారులు ప్రకటించారు. ఉగాండాకు చెందిన అల్లైండ్ డెమొక్రటిక్ ఫోర్సెస్ గ్రూప్ స్థానికులపై దాడులకు పాల్పడిందని ఆర్మీ అధికారులు ఆరోపించారు.