Authorization
Wed April 30, 2025 09:03:03 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో పరాస్ గ్రామంలో ఉన్న బాబుజీ మహరాజ్ మందిర్ సంస్థాన్‌కు చెందిన రేకుల షెడ్డుపై భారీ వేప చెట్టు పడింది. దీంతో షెడ్డుకింద తలదాచుకున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయకచర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో చెట్టును తొలగించారు. శిథిలాల కింది నుంచి క్షతగాత్రులను బయటకు తీసి దవాఖానకు తరలించారు. మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, చెట్టు కూలిన ఘటనను జిల్లా కలెక్టర్ నిమా అరోరా ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 30 నుంచి 40 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని చెప్పారు.