Jail ke mazaa khao….someone took it literally! pic.twitter.com/PD9VB4dlZy
— Harsh Goenka (@hvgoenka) April 8, 2023
Authorization
Jail ke mazaa khao….someone took it literally! pic.twitter.com/PD9VB4dlZy
— Harsh Goenka (@hvgoenka) April 8, 2023
నవతెలంగాణ -బెంగళూరు: బెంగళూరులో ఓ వినూత్నమైన రెస్టారెంట్ ఏర్పాటైంది. జైలుకు వెళ్లి కావాల్సిన పదార్థాలు తిన్న అనుభూతిని ఈ రెస్టారెంట్ ఇస్తుంది. ఓ సెంట్రల్ జైలు నమూనాలో ఈ రెస్టారెంట్ ను నిర్మించారు. బయట ప్రధాన గేటుపైన సెంట్రల్ జైలు అని రాసి ఉంటుంది. పక్కనే ఓ జైలు వార్డర్ కాపాలాగా ఉన్న బొమ్మ కనిపిస్తుంది. రెస్టారెంట్ లోపలికి అడుగు పెడితే వరుసగా గదులు ఉంటాయి. వాటికి జైలు ఊచలు కనిపిస్తాయి. కారాగారం లోపల ఉన్న అనుభూతిని కల్పించేందుకు ఇలా సెటప్ చేశారు.
జైలర్ డ్రెస్ వేసుకున్న వారు వచ్చి ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ చేసిన వాటిని ఇక్కడ సర్వర్లు ఖైదీల డ్రెస్ వేసుకుని అందిస్తుంటారు. ఈ వీడియోని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఈ రెస్టారెంట్ హెచ్ఎస్ఆర్ లే అవుట్ 27వ మెయిన్ రోడ్డులో ఉంది. ఓ బ్లాగర్ ఈ రెస్టారెంట్ గురించి వీడియో చేయడంతో దీని గురించి అందరికీ తెలిసింది. ఈ వీడియోని చూసిన వారు ఐడియా చాలా వినూత్నంగా ఉందంటూ మెచ్చుకుంటున్నారు.