Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -పశ్చిమగోదావరి: నకిలీ నోట్ల ముఠా ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రలో ఓ యువకుడు డబ్లింగ్ కరెన్సీ ముఠా చేతిలో హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరిలో ఈ నెల 5న అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పెంటపాడు కాలువలో శవమై తేలిన పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామానికి చెందిన కేతా నరసింహ స్వామిగా గుర్తించారు. డబ్లింగ్ కరెన్సీ ఆశ చూపి నరసింహస్వామి నుంచి 3 లక్షలు కాజేశారు. తీసుకున్న డబ్బు గురించి నరసింహస్వామి ప్రశ్నించడంతో అతడిరి హత్య చేసి కాలువలో పడేశారు. మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.