Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. రాహుల్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఆయన చేసిన ఓ ట్వీట్ పరువు నష్టం కలిగించేదిలా ఉందని అన్నారు. అదానీ అంశంపై రాహుల్ ఓ ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీతో హిమంత బిశ్వ శర్మకు సంబంధాలు ఉన్నాయని ఆ ట్వీట్లో ఆరోపించారు. ‘వాళ్లు నిజాన్ని దాచిపెట్టారు. అందుకే రోజూ తప్పుదోవ పట్టిస్తున్నారు. అదానీ కంపెనీల్లో రూ.20,000 కోట్లు బినామీ సొమ్ము ఎవరిది..? అన్న ప్రశ్న ఇంకా అలాగే మిగిలే ఉంది’ అని ట్వీట్ చేశారు. దీంతోపాటు కొందరు నాయకుల పేర్లను అదానీకి జత చేస్తూ ఓ చిత్రాన్ని పోస్ట్ చేశారు. గులాం నబీ అజాద్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ కుమార్ రెడ్డి, హిమంత, అనిల్ కె ఆంటోనీ అనే పేర్లు రాహుల్ పోస్ట్ చేసిన చిత్రంలో కనిపించాయి. రాహుల్ ట్వీట్‌పై స్పందించిన హిమంత శర్మ.. ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడబోనని చెప్పారు. ఇప్పుడు అస్సాం బోహాగ్ బిహు ఉత్సవాల కోసం సిద్ధమవుతోందని ఈ సమయంలో తాను దీనిపై చర్చించబోనని చెప్పారు.