Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగిత్యాల
జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తెరుచుకోనుంది. ఎన్నికల అధికారి, కలెక్టర్ యాస్మిన్ భాషా స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు చేరుకున్నారు. అయితే స్ట్రాంగ్ రూం తాళం కనిపించక అయోమయం నెలకొంది. ఉదయం పది గంటలకే తాళాలు తెరుచుకోవాల్సి ఉండగా.. మధ్యాహ్నం గడుస్తున్నప్పటికీ ఇంకా తెరుచుకోలేదు. దీంతో తాళాలు పగులగొట్టే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ తరుణంలో మరోవైపు ఈవీఎంలు భద్రపరిచిన కాలేజీలో తేనెతుట్టె కదిలింది. దాంతో భవనంలో ఉన్నవారంతా ఒక్కసారిగా పరుగులు పెట్టారు. స్ట్రాంగ్ వద్ద కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ తెరిచి కోర్టు అడిగిన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి కోర్టుకు పంపిస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్లో డాక్యుమెంట్ల పరిశీలనను వీడియో గ్రఫీ చేస్తామని కలెక్టర్ యాస్మిన్ తెలిపారు.