Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తరాఖండ్
హల్ద్వాని జైలులో హెచ్ఐవీ కలకలం సృష్టిస్తున్నది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 44 మందికి హెచ్ఐవీ సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం. జైలులో ఎయిడ్స్ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అపమత్తమయ్యారు.
బాధితుల కోసం అక్కడే ఏఆర్టీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సుశీలా తివారీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ పరమ్‌జిత్ సింగ్ తెలిపారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. అయితే హెచ్ఐవీ సోకినవారంతా డ్రగ్స్ బానిసలేనని తెలిపారు. జైలులో ప్రస్తుతం 1629 మంది పురుష, 70 మంది మహిళా ఖైదీలు ఉన్నారని చెప్పారు.