Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణాల్లో ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ, ఇబ్బంది కలిగిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి వారి కారణంగా తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. టెకాఫ్ అయిన కాసేపటికే ఢిల్లీకి రివర్స్ అయింది. ఓ ప్రయాణికుడు రచ్చ చేయడమే ఇందుకు కారణమైంది. విమానం గాల్లో ఉండగా సదరు వ్యక్తి విమాన సిబ్బందితో గొడవ పడ్డాడు. ఇద్దరు సిబ్బందిపై దాడి చేశాడు. ఎంత సర్దిచెప్పిన అతను వినకపోవడంతో పైట్ విమానాన్ని వెనక్కుతిప్పాడు. తిరిగి ఢిల్లీలోని విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. సదరు ప్రయాణికుడిని విమానం నుంచి దింపేసి ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.