Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ తరుణం 12న సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు పెట్టనున్నారు. ఈ ఇఫ్తార్ విందుకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం నాడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహాముద్ అలీతో కలిసి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మత సామరస్యం వెల్లివిరిసే విధంగా రంజాన్ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.