Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
క్రికెటర్ల భత్యాలకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ పర్యటనలకు వెళ్లే ఆటగాళ్ల భత్యాలను పెంచింది. అలాగే ఫస్ట్‌క్లాస్ టికెట్‌తో ప్రయాణించేందుకు అనుమతినిచ్చింది. రోజువారీ అలవెన్స్‌ను 1000 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అయితే తాజాగా అపెక్స్ కౌన్సిల్ భేటీలో బీసీసీఐ ప్రతిపాదించినప్పటికీ ఇలాంటి సౌకర్యాలను గతేడాది అక్టోబర్ నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. దాదాపు ఏడేళ్ల తర్వాత రోజువారీ అలవెన్స్‌లో మార్పులు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు 750 డాలర్లుగా ఉండే అలవెన్స్‌ను వెయ్యికి పెంచేసింది. ఇక దేశంలో జరిగే సమావేశాలకు హాజరయ్యే బీసీసీఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్, సంయుక్త కార్యదర్శి సహా ఆఫీస్ బేరర్లకు రోజుకు రూ.40వేల అలవెన్స్‌ను బీసీసీఐ చెల్లించనుంది. బిజినెస్ క్లాస్ టికెట్ ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది. ‘వర్క్ ట్రావెల్’ కోసం రోజుకు రూ. 30వేలు, సూట్ రూమ్ బుక్ చేసుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఐపీఎల్ ఛైర్మన్‌కు కూడా ఆఫీస్ బేరర్స్ కేటగిరీలో అలవెన్సులు వర్తిస్తాయి.