Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ బుల్లితెర నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ప్రముఖ సింగర్ సమర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హోటల్లోని సీసీటీవీ దృశ్యాలు మరింత కీలకంగా మారాయి. చనిపోయే కొన్ని నిమిషాల ముందు ఆమె ఓ వ్యక్తితో ఉన్న దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భోజ్‌పురి నటి ఆకాంక్ష ఓ సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లారు. అక్కడే ఆమె ఓ హోటల్లో ఉంటూ షూటింగ్లో పాల్గొన్నారు. మార్చి 26న షూటింగ్ ముగిసిన వెంటనే హోటల్‌కు తిరిగొచ్చిన ఆకాంక్ష దూబే అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. చనిపోవటానికి కొన్ని నిమిషాల ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తితో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఆకాంక్షతో పాటు కనిపించిన ఆ వ్యక్తి ఎవరో ఇంకా వివరాలు తెలియరాలేదు. ఆకాంక్ష మరణంతో అతడికి ఏదైనా సంబంధముందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.