Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
పదో తరగతి హిందీ పేపర్ లీక్ మాట పచ్చి అబద్ధమని అది మాల్ ప్రాక్టీస్ అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పేపర్ బయటకు వచ్చిన ఘటనపై సోమవారం వరంగల్ డీసీపీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ తరుణంలో నా సెల్‌ఫోన్ తీసుకుని డీసీపీ వద్ద ఈరోజు విచారణకు హాజరయ్యాను. నా సమక్షంలోనే అధికారులు సెల్‌ఫోన్ పరిశీలించారు. ప్రశాంత్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని నిర్ధరించుకున్నారు. నా మొబైల్‌కు మహేశ్ వాట్సప్ మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్‌ను ఇతరులకు పంపలేదని పోలీసులు తెలుసుకున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలైతే 11 గంటల తర్వాత పేపర్ బయటికి వస్తే దాన్ని పేపర్ లీక్ అని ఎలా అంటారు? అధికారాన్ని అడ్డుపెట్టుకుని కావాలనే నాపై కేసులు పెట్టాలని కుట్ర పన్నారు అని ఈటల ఆరోపించారు.