Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తరుణంలో ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం పరిశీలించారు.
విగ్రహావిష్కరణకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రితోపాటు వీవీఐపీలు పాల్గొనే విగ్రహావిష్కరణకు ఉపయోగించే కర్టెన్, సందర్శకులకు ప్రవేశం, బహిరంగ సభ నిర్వహణ స్థలం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రులు సమీక్షించారు. దీనిలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎస్సీ డెవలప్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్పీ డెవలప్మెంట్ శాఖ కమిషనర్ యోగితా రానా, మల్లేపల్లి లక్ష్మయ్య ఆర్అండ్బీ అధికారులు పరిశీలించారు.