Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎల్ఐసీ కార్యాలయాల్లో అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జోన్ల వారీగా మొత్తం 9,394 ఏడీవో పోస్టులను భర్తీ చేసేందుకు జనవరిలో భారీ నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. వీటిలో సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్) పరిధిలోనే 1,408 పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాల భర్తీ కోసం మార్చి 12న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా సోమవారం జోన్ల వారీగా ఫలితాలను పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులంతా ఏప్రిల్ 23న జరిగే మెయిన్స్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. మెయిన్లోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.