Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హనుమకొండ
హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి వైద్యం వికటించి చనిపోయాడు. మామునూరు ఎంజేపీ గురుకుల పాఠశాలలో అవినాష్ అనే విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం కడుపు నొప్పి వస్తుందని పాఠశాల నిర్వాహకులకు తెలిపాడు విద్యార్థి. దీంతో వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు స్యూల్ సిబ్బంది. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడిని చికిత్స కోసం హసన్ పర్తి లోని శంకర్ అనే ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. చికిత్స అందిస్తున్న క్రమంలో డాక్టర్ కొన్ని ఇంజక్షన్స్ ఇచ్చాడు.. దీంతో విద్యార్థి పరిస్థితి విశమించింది. వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా విద్యార్థి మృతి చెందాడు.
అయితే డాక్టర్ శంకర్ చేసిన ట్రీట్మెంట్ వికటించడంతో తోనే తమ కొడుకు మృతి చెందాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.