Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ నుంచి మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తునట్లు సమాచారం. ఈ తరుణంలో అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి కొత్త రైలును నడపాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది.
ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్-తిరుపతి మధ్య కొత్త వందేభారత్ రైలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పర్యటన సందర్భంలోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కొత్త వందే భారత్ రైలు నడిపే అంశాన్ని ఇక్కడి బీజేపీ నేతలతో ప్రస్తావించినట్టు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్పి ఉంది. అయితే ఇప్పటికే కాచిగూడ నుంచి బెంగళూరుకు పలు రైళ్లు సేవలందిస్తుండగా.. 570 కి.మీల దూరాన్ని కనీసం 11గంటల్లో కవర్ చేస్తున్నాయి. అదే, సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వస్తే మాత్రం ఆ సమయంలో నాలుగు గంటలు సమయం తగ్గనుంది.