Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: భారత్, అమెరికా ప్రత్యేక దళాలు.. యుద్ధ విన్యాసాలు చేపడుతున్న విషయం తెలిసిందే. చైనాతో టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ వార్‌గేమ్స్ కొనసాగుతున్నాయి. అయితే ఇండియాకు భరోసాను ఇచ్చే ఉద్దేశంతో అమెరికా తన ఎఫ్-15 స్ట్రయిక్ ఈగిల్ యుద్ధ విమానాలను తీసుకురానున్నది. కలైకుండాలో జరగనున్న యుద్ధ విన్యాసాల్లో అమెరికాకు చెందిన భారీ ఫైటర్ విమానాలు పాల్గొననున్నాయి. ఇటీవల బ్రిటన్, యూఏఈ దేశాలతోనూ ఇండియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఫ్రాన్స్‌లోని ఓరియన్‌లో జరగనున్న విన్యాసాల్లో ఇండియా తన రాఫేల్ యుద్ద విమానాలను ప్రదర్శించనున్నది.