Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూయార్క్ : ప్రిస్క్రిప్షన్ డిజిటల్ థెరాప్యుటిక్స్ను అభివృద్ధి చేసి మార్కెట్ చేసే అమెరికాకు చెందిన పీర్ థెరాప్యుటిక్స్ 170 మంది ఉద్యోగులను తొలగించునున్నట్టు ప్రకటించింది. పీర్ థెర్యాప్యుటిక్స్‌కు ఈరోజు సంక్లిష్టమైన దినమని, విక్రయ ప్రక్రియ ద్వారా ఆస్తులను అమ్మేందుకు కసరత్తు సాగిస్తున్నామని, ఉద్యోగులను తొలగిస్తూ సిబ్బంది సంఖ్యను కుదిస్తున్నామని పీర్స్ సీఈవో కోరీ మెకన్ పేర్కొన్నారు.
తొలగించిన ఉద్యోగులందరికీ రెండు వారాల వేతనాన్ని పరిహారంగా అందిస్తామని ప్రకటించారు. ఇక అమెరికాకు చెందిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ అంప్లిట్యూడ్ 99 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. పదేండ్ల కిందట అంప్లిట్యూడ్ను ప్రారంభించిన అనంతరం తొలిసారి అత్యంత బాధాకరమైన నిర్ణయం వెల్లడిస్తున్నానని, కంపెనీలో 13 శాతం సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నామని సీఈవో, సహ వ్యవస్ధాపకుడు స్పెన్సర్ స్కేట్స్ బ్లాగ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటం, ఆర్ధిక మందగమనంతో పలు టెక్ దిగ్గజాలు వ్యయాలకు కళ్లెం వేసేందుకు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ వంటి దిగ్గజ కంపెనీలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడిన సంగతి తెలిసిందే.