Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో సమగ్రమైన విచారణ జరిపించాలని రేపు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద విద్యార్ధి, నిరుద్యోగ దీక్ష జరుపుతున్నట్లు ఈ దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ-డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీలు పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వం నుండి ఏలాంటి స్పందన లేదని ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో సమగ్రమైన విచారణ జరిపించాలని, నష్టపోయిన విద్యార్థులకు నెలకు 20,000/- వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించాలని తదితర డిమాండ్లతో ఈ మహాదీక్ష చేస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తెలిపారు.