Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం మరో తీర్మానం చేసింది. ఈ సందర్భంగా గవర్నర్ తీరుపై సీఎం స్టాలిన్ మండిపడ్డారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో ఉంచచడాన్ని విమర్శించారు. ఈ నేపథ్యంలో నిర్ధిష్ట గడువులోగా బిల్లులను క్లియర్ చేసేలా రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం గవర్నర్ను ఆదేశించాలని కోరుతూ సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆర్ఎన్ రవి దిగి వచ్చారు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్లైన్ గేమ్లను నియంత్రించే బిల్లుకు ఆ వెంటనే ఆమోదం తెలిపారు.