Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మతిస్థిమితం లేని ఓ మహిళ తన భర్త చనిపోయాడన్న విషయం గ్రహించలేదు. భర్త చనిపోయి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన శవంతో ఇంట్లోనే ఉండిపోయింది. మృతదేహం ఉబ్బి దుర్వాసన వెదజల్లినప్పటికీ ఆమె తన పని తాను చేసుకుంటూ గడిపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని కొణిజెర్లలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే మాజీ ఉద్యోగి బీ. వీరభద్రం(65), తన భార్య మంగమ్మతో కలిసి శాంతి నగర్లో నివాసం ఉంటున్నాడు. వీరభద్రం పెద్ద కుమారుడు వెంకట కృష్ణ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కాగా, ఖమ్మం పట్టణంలో నివసిస్తున్నాడు. మరో కుమారుడు, కుమార్తె హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. తండ్రి అనారోగ్యానికి గురికావడం, తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో వెంకటకృష్ణ ప్రతి రోజు వారికి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేవారు. అయితే ఏప్రిల్ 6వ తేదీన వెంకట కృష్ణ ఫోన్ చేసినప్పటికీ తండ్రి సమాధానం ఇ్వలేదు. తల్లినే ఫోన్లో ఏదో మాట్లాడి పెట్టేసింది. ఇక నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో వెంకట కృష్ణ శాంతినగర్ చేరుకున్నాడు. బెడ్రూంలో మంచంపై ఉబ్బి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసి కుమారుడు షాక్ అయ్యాడు. వీరభద్రం తలకు గాయం కావడంతోనే మరణించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుమారులు, కుమార్తె, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.