Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్రంలో భవననిర్మాణ అనుమతులను సకాలంలో అందించాలన్న టీఎస్ బీపాస్ చట్టానికి విరుద్ధంగా అనుమతులకై దరఖాస్తులు అందిన 15 రోజులకు కూడా అనుమతులు జారీ చేయని 29 మంది మున్సిపల్ కమిషనర్లు, సైట్, టెక్నీకల్ వెరిఫికేషన్ అధికారులకు ఒక్కొక్కరికి రూ. 3000ల జరిమానా విధించి, వారి జీతాలనుండి రికవరీ చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భవన నిర్మాణ అనుమతుల జారీలో నిర్దారిత సమయాన్ని మించి జాప్యం చేసిన అధికారుల వివరాలను జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన గల జిల్లా స్థాయి టీఎస్ బీపాస్ కమిటీలు ప్రభుత్వానికి పంపిన నివేదికను ప్రభుత్వం సమీక్షించింది. ఈ జాప్యానికి కారణమైన నలుగురు మున్సిపల్ కమిషనర్లు,13 మంది సైట్ టెక్నీకల్ వెరిఫికేషన్ అధికారులు, 10 మంది సైట్ వెరిఫికేషన్ అధికారులకు జరిమానా విధించాలని ఆదేశించినట్టు అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు హనుమకొండ, మేడ్చల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ రాసిన లేఖలో అర్వింద్ కుమార్ పేర్కొన్నారు.