Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు కేఆర్ సూర్యనారాయణ, ఆస్కార్ రావు కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల ఉద్యోగులకు రాష్ట్రంలో జీతాలు లేవన్నారు. వచ్చే నెల కూడా ఇదే పరిస్థితి? ఉంటుందేమోనన్నారు. వైద్య ఆరోగ్య, ఐసిడిఎస్ కుటుంబ సంక్షేమ శాఖ, పురపాలక, పట్టాభివృద్ది శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. నాలుగోవ క్వార్టర్ కేంద్ర బడ్జెట్‌కు లెక్కలు చెప్పకపోవడమే కారణమన్నారు. 2023-24 మొదటి క్వార్టర్ నిధులు కేంద్రం నిలిపేచిందన్నారు. కేంద్రం నిలుపుదల చేసిందని జీతాలను ఏపీ ప్రభుత్వం ఆపేసిందని పేర్కొన్నారు. గత ముప్పై, నలభై ఏళ్లుగా ఎన్నడూ లేని వింత పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగులకు జీతాల చెల్లింపు ప్రభుత్వ ఖజానా నుంచే జరగాలన్నారు.