Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టి పరారయ్యారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 133 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ పూర్తిగా కాలిపోయి రోడ్డుపై పడిపోయింది. పోలీసులకు స్థానికులు సమాచారంతో ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మహిళను ఆస్పత్రికి తరలించారు. అయితే తన భర్తే తనను తగలబెట్టాడని బాధితురాలు అంటుంది. భర్త తగులబెట్టాడా? లేక తానే తగులబెట్టుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళను అత్తాపూర్ వాసి శివానీగా పోలీసులు గుర్తించారు.