Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దీంతో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు వీరిద్దరి వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది.
ఈ క్రమంలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. మనీలాండరింగ్ జరిగినట్లు అంచనా వేస్తోంది. సిట్ అధికారులు సాక్షిగా పేర్కొన్న కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిపై ఈడీ ప్రధాన దృష్టి పెట్టింది. ఆమెతో పాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. మరోవైపు ప్రవీణ్, రాజశేఖర్లను కస్టడీకి తీసుకొని ఈడీ విచారించనుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది.