Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం అత్తాపూర్లో శివాని (35) అనే మహిళ బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తోంది.
మంగళవారం ఉదయం ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి తనపై తానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్వేత అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం శివానిని 108 వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అయితే దేవుడు చెప్పాడంటూ శివాని ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రాథమికంగా పోలీసులు తెలిపారు.