Authorization
Wed April 30, 2025 07:26:25 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పటికే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే ఇలా ఉంటే నడి ఎండాకాలంలో పరిస్థితి ఏంటని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రేపటి నుంచి ఎండలు ఇంకా మండిపోతాయని వాతావరణ నివేదిక చెబుతోంది. ఏప్రిల్ 12 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనేక చోట్ల గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా తెలంగాణలో మూడ్రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వివరించింది. అధిక వేడిమి కారణంగా, వడదెబ్బ ముప్పు ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరి అయితేనే బయటికి రావాలని సూచించింది.