Authorization
Tue April 29, 2025 11:46:30 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభపడ్డాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు మన మార్కెట్లకు అండగా నిలిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 60,393కి పెరిగింది. నిఫ్టీ 90 పాయింట్లు పుంజుకుని 17,812కి చేరుకుంది.