Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనపై దాడికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఫేక్ చాట్ లతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆర్థిక నేరగాడు సుఖేశ్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారని విమర్శించారు. ఓ ఆర్థిక నేరగాడు ఒక అనామిక లేఖను రిలీజ్ చేస్తే దానిని పట్టుకుని కొందరు రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఆ లేఖను పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈసీకి లేఖ రాయడం, బీజేపీ టూల్ కిట్ లో భాగంగానే పనిగట్టుకుని సోషల్ మీడియాలో బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.