Authorization
Tue April 29, 2025 05:05:46 pm
నవతెలంగాణ - అమరావతి
విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణపై ఇప్పటికిప్పుడు ముందుకెళ్లే ఆలోచన లేదని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనపై పవన్ స్పందించారు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదు. విశాఖ ఉక్కు తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడి ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు విశాఖ ఉక్కుతో తెలుగు వారి భావోద్వేగాన్ని తెలిపాను.