Authorization
Wed April 30, 2025 08:31:38 pm
నవతెలంగాణ- ఖమ్మం
చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నేపథ్యంలో, బాణసంచా కారణంగా అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందడం తెలిసిందే. పలువురు గాయపడ్డారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చీమలపాడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. బాధితులకు అన్ని రకాల బెనిఫిట్స్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా అన్యాయం జరిగితే తనకు కాల్ చేయాలని పవన్ వారికి సూచించారు.