Authorization
Tue April 29, 2025 04:21:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
చందానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. చిన్న పిల్లలు తినే ఐస్ క్రీం ను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హానికరమైన రసాయనాలతో నకిలీ ఐస్‌క్రీమ్‌లను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ముఠా గుట్టు రట్టైంది. పోలీసులు జరిపిన దాడిలో బ్రాండెడ్ పేర్లతో నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేయడంతో పాటు ఐస్‌క్రీంలపై బ్రాండెండ్ కంపెనీల స్టిక్కర్లతో మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో షాపులోని సరుకు సీజ్ చేసి నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.