Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: జనసేన ప్రధాన కార్యదర్శిగా కొణిదెల నాగబాబును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నాగబాబు ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన సేవలు పార్టీకి మరింత ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించారు.
విదేశాల్లో ఉన్న జనసేన పార్టీ ప్రతినిధులు, అభిమానుల్ని సమన్వయ పరిచే బాధ్యతల్ని కూడా నాగబాబు నిర్వర్తిస్తారు. ఎన్ఆర్ఐల సేవలను పార్టీకోసం ఉపయోగించుకోనున్నారు. నెల్లూరుకు చెందిన వేములపాటి అజయ్ కుమార్‌ను జాతీయ మీడియాకు పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా నియమించారు. రాజకీయ శిక్షణా తరగతులు, బూత్‌స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ బాధ్యతల్ని కూడా అప్పగించారు. వీరిద్దరూ పార్టీకి మేలైన సేవలందిస్తారని పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. నాగబాబు, అజయ్‌కు అభినందనలు తెలియజేశారు.