Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బాలీవుడ్ తార షెర్లిన్ చోప్రాకు ఓ ఫైనాన్షియర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీనిపై ఆమె ముంబై పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు సదరు ఫైనాన్షియర్‌పై కేసు నమోదు చేశారు. ఓ వీడియో రికార్డింగ్ విషయంలో తనను ఫైనాన్షియర్ వేధిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని షెర్లిన్ పోలీసులకు తెలిపింది. వీడియో రికార్డింగ్‌కు ఒప్పుకున్న తాను అనుకోని కారణాల వల్ల ఆ వీడియో షూటింగ్లో పాల్గొనలేకపోతున్నానని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఒప్పుకున్నట్లు షెర్లిన్ వెల్లడించింది. అయినా ఫైనాన్షియర్ నుంచి బెదిరింపులు ఆగడం లేదంది. గతంలో మీటూ ఉద్యమం సందర్భంగా షెర్లిన్ చోప్రా సల్మాన్ ఖాన్‌ను విమర్శించి వార్తల్లో నిలిచింది. బిగ్‌బాస్ కార్యక్రమానికి మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు షాజిద్ ఖాన్‌ను పెట్టుకోవడంపై షెర్లిన్ సల్మాన్‌పై విమర్శలు చేసింది.