Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని తుముకూరు జిల్లా హిరాహేళిలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఎస్యూవీ, ప్రయివేటు బస్సు ఢీకొన్న ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తుముకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.