Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత కూడా అతని ఫ్యాన్ ఫాలోయింగో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని ప్రముఖ సినీ నటీ ఖుష్బూ అత్తగారిని కలిసి సర్ ప్రైజ్ చేశాడు. తమను కలిసేందుకు వచ్చిన ధోనిని ఖుష్బూ అత్తగారు ఆప్యాయంగా ముద్దాడారు. అందరూ కలిసి సరదాగా ఫోటోలు దిగారు. మహేంద్ర సింగ్ ధోనితో దిగిన ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధోని సింప్లిసిటీపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ధోనీ-ఖుష్బూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.