Authorization
Wed April 30, 2025 02:08:09 am
నవతెలంగాణ-హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఖమ్మంకు చెందిన దంపతులు లౌకిక్, సుస్మితలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. షిట్ కార్యాలయం నుంచి ఉదయం 8 గంటలకు ఇద్దరినీ తీసుకుని సిట్ అధికారులు ఖమ్మం వెళ్ళారు. సుస్మితా, లౌకిక్ ఇంట్లో సోదాలు చేయనున్నారు. వారి వాహనాన్ని కూడా సిట్ అధికారులు సీజ్ చేయనున్నారు. ప్రవీణ్ నుంచి భార్య కోసం లౌకిక్ డీఏవో పేపర్ కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఏప్రిల్ ఏడో తేదీన లౌకిక్, సుస్మితలను అరెస్ట్ చేశారు.