Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టుకు అబద్ధాలు చెబుతున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. లిక్కర్ స్కామ్లో ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కేజ్రీ ఈ ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థలు అబద్దాలు చెప్పి, ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. సీబీఐ నుంచి తనకు సమన్లు అందినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఆ సమన్లను గౌరవిస్తున్నట్లు కూడా చెప్పారు. ఇవాళ మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడారు. ప్రధానికి వంద కోట్లు ఇచ్చినట్లు నేను చెబితే, అప్పుడు ప్రధానిని అరెస్టు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.