Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నెల్లూరు
నగరంలో అమానుషం చోటుచేసుకుంది. ప్రియదర్శినీ ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కళాశాల ఛైర్మన్ కారు డ్రైవర్ శశి ప్రేమ పేరుతో విద్యార్ధిని మోసం చేసి గర్భం చేశాడు. ఈ తరుణంలో అయిదు నెలల గర్భవతి అయిన విద్యార్ధినితో కారు డ్రైవర్ శశి గర్భశ్రావం మాత్రలు మింగించాడు. హాస్టల్లోనే గర్భశ్రావం జరిగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే విద్యార్ధిని మృతి చెందింది. అయితే కాలేజీ యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ శశి, అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.