Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి నైవేధ్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదానికి కూడా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు ధరల నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న ఆయన దాతలు అందించిన 10 లక్షల రూపాయల వ్యయంతో బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి కవచాలు ఏర్పాటు చేస్తామన్నారు. పద్మావతి మేడికల్ కాలేజీలో టిబి విభాగం ఏర్పాటుకు 53.62 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. వీటితో పాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఫారిన్ కరెన్సీ మార్పిడిపై కేంద్రం విధించిన 3 కోట్ల జరుమానను రద్దు చేయాలని హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లాలని పాలక మండలి సమావేశం నిర్ణయించిందని తెలిపారు.