Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఐపీఎల్-2023లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్దమైంది. నేడు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరులో జరుగుతున్న శనివారం నాటి మ్యాచ్‌లో ఇరు జట్లు ఒకే మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ జట్టులోకి మిచెల్ మార్ష్ రాగా స్పిన్నర్ వనిందు హాసరంగా ఆర్సీబీ జట్టులోకి చేరాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్.