Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోల్‌కతా
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో కార్గో విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చింది. ఈ తరుణంలో ఆ విమానాన్ని సమీప ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కార్గో విమానం జెడ్డా నుంచి హాంకాంగ్‌కు వెళ్తున్నది. ఆ విమానం భారత గగనతలంపై ఎగురుతుండగా దాని విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చింది. దానిని గమనించిన విమాన పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ కార్గో విమానాన్ని కోల్‌కతా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. దీంతో శనివారం ఉదయం 11.30 గంటలకు ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించారు. అయితే సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కార్గో విమానం శనివారం మధ్యాహ్నం 12.02 గంటలకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా దిగింది. ఆ కార్గో విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ పరిస్థితిని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు.