Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచర్లు ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని దొంగ తనాలకు పాల్పడుతున్నారు. మహిళల ప్రాణాలతో చైన్ స్నాచర్స్ చెలగాటమాడుతున్నారు. మహిళల మెడలోనుంచి చైన్ స్నాచర్లు బంగారం గొలుసును లాక్కెళ్లే సమయంలో మహిళల ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే శనివారం రోజు ఢిల్లీలో ఇద్దరు చైన్ స్నాచర్స్ బైక్ పై వచ్చి మహిళ మెడలోనుంచి బంగారం గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో మహిళ ఓ షాపులో కిందపడిపోయింది. ఈ ఘటన మొత్తం షాపులో ఉన్న కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన రోహిణి ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఇద్దరు దొంగలు ఓ షాపు వద్ద వేచిఉన్న మహిళ మెడలో నుంచి నెక్లెస్ లాక్కెళ్లారు. వారిలో ఒకరు దుకాణం లోపల పడిపోయిన మహిళపై తుపాకీ గురిపెట్టి గొలుసు లాక్కొని అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. షాపులోని ఒక వ్యక్తి మహిళకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కెమెరాలో రికార్డు అయింది. అయితే అతను తుపాకీని చూసిన వెంటనే పారిపోయాడు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.